అల్లు అర్జున్ రాబోవు సినిమా టైటిల్ ‘పుష్ప’ గా ఖరారు…!

88
allu-arjun-movie-pushpa-2020

అల్లు అర్జున్ రాబోవు సినిమా టైటిల్ ‘పుష్ప’ గా ఖరారు…!

దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కించబోతున్న సినిమా పేరు ‘పుష్ప’ గా ఖరారు చేసారు. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు బన్నీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేసరికి వాళ్ళ ఆనందానికి అంతే లేదు.

ఇది అల్లు అర్జున్ అభినామానులకు తన 37 వ బర్త్ డే గిప్ట్. మరోసారి సుకుమార్ సరి కొత్తగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు . ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక మండన్న, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, నాని యొక్క ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ మిరోస్లా కుబా బ్రోజెక్ కెమెరా విభాగాన్ని చూసుకుంటున్నారు.

Read Also: కోటి రూపాయల విరాళం ఇచ్చిన చిరంజీవి !

ఈ సినిమా కథాంశం మొత్తం చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. మంచి మొరటోనిగా చిత్తూరు జిల్లా యాస తో అదరగొట్టబోతున్నాడు దీనికోసం చిత్తూరు యాస ని నేర్చుకున్నాడు మన బన్నీ. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం 5 భాషల్లో విడుదల కాబోతుంది.

allu arjun movie-pushpa-2020

 

LEAVE A REPLY