ఆరోగ్య సేతు యాప్ వల్ల ఉపయోగం ఏమిటి ?

371
arogya setu app uses and download
arogya setu app

ఆరోగ్య సేతు యాప్ వల్ల ఉపయోగం మీకు తెలుసా …

మన భారత  ప్రభుత్వం ఈ యాప్ ని ఏప్రిల్ 2, 2020 న విడుదల చేసారు ఇప్పటి వరకు ఈ యాప్ ని 5 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
ఈ ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించినట్లయితే కరోనా వైరస్ పరీక్షలలో పాజిటివ్ గా నిర్దారింపబడిన వారు సంచరించిన ప్రాంతంలో మీరు కూడా సంచరిస్తున్నట్లయితే వెంటనే మీకు ఈ యాప్ మీకు తెలియజేస్తుంది.

Read Also : తబ్లీగీ జమాత్ మర్కజ్ వల్ల భారీగా పెరిగిన కరోనా కేసులు …!

అది ఎలాగా అంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నవారు తమ మొబైల్ లో బ్లుటూత్ మరియు జి పి ఆర్ ఎస్ ను ఆన్ చేసి ఉంచాలి.

COVID 19 పరీక్షలలో పాజిటివ్ గా నిర్దారింపబడిన వారితో మీరు సన్నిహితంగా వుంటున్నట్లయిహతే బ్లుటూత్ మరియు లొకేషన్ జనరేటెడ్ గ్రాఫ్ ద్వారా ఈ ఆరోగ్య సేతు ట్రాక్ చేస్తుంది.

మీకు తెలియకుండా మీరు COVID 19 వున్నా వారికీ సమీపంగా వెళ్ళినట్లయితే ఈ యాప్ వెంటనే మీకు అలర్ట్ రూపంలో తెలియచేస్తుంది.

Read Also : కరోనా అంటే ఏమిటి? ఎలా నివారించ వచ్చు?

అంతేకాకుండా ఈ యాప్ అలర్ట్ సెల్ఫ్ ఐసొలేషన్ అవ్వడం ఎలానో కూడా తెలియచేస్తుంది ఇంకా మీలో వైరస్ లక్షణాలు వృద్ధి చెందితే అవసరమైన సహాయం, మద్దతు ఎలా పొందాలో తెలియజేసే సూచనలు కూడా ఇస్తుంది.

ఈ యాప్ ని ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల కరోనా బారిన పడకుండా మనల్ని మన కుటుంబంలోని వారిని రక్షించుకోవచ్చు.

కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకొని తమ మొబైల్స్ లో బ్లుటూత్ మరియు జి పి ఆర్ ఎస్ ను ఎల్లప్పుడూ ఆక్టివేట్ లో వుంచుకునేలా చూసుకోండి. కరోనా బారిన పడకుండా ఉండండి.

Read Also :కరోనా వైరస్ వ్యాప్తి పై ప్రజలకు, మీడియాకు సూచనలు…

ఈ యాప్ ని కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఆండ్రాయిడ్ మొబైల్ ఉపయోగిస్తున్నవారైతే :
https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu

IOS మొబైల్ ఉపయోగిస్తున్నవారైతే :
https://apps.apple.com/in/app/aarogyasetu/id1505825357

QR code ద్వారా డౌన్లోడ్  చేసుకోవాలంటే కింద ఇమేజ్ ని స్కాన్ చేసి ఆండ్రాయిడ్, IOS మొబైల్  డౌన్లోడ్ చేసుకోవచ్చు

arogya setu app QR code

 

LEAVE A REPLY