కోటి రూపాయల విరాళం… చిరంజీవి !

35
Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

కోటి రూపాయల విరాళం… చిరంజీవి ! : అన్ని నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే కరోనా ప్రమాదకారి కాదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారిగా మారే అవకాశం వుంది.

కాబట్టి ఎవరూ కూడా అలంటి పరిస్థితి తెచ్చుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారిని మనం అందరం కలిసికట్టుగా తిప్పికొట్టాలి దాన్ని పూర్తిగా నిర్ములించాలి అన్నారు.

అయితే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశమంతటా లక్డౌన్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే, ఈ లక్డౌన్ వల్ల రోజువారీ కార్మికులపైనా చాల ఎక్కువగా ప్రభావం చూపుతుంది.

అందువల్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే కార్మికులను దృష్టిలో పెట్టుకొని వారికోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.

Read also…
చిరంజీవి సరసన కాజల్ !
యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోస్ !

LEAVE A REPLY