అణుమాత్రం కూడా  అలసత్వం వద్దు

43

అందరూ కలిసికట్టుగా నియమాలు పాటిస్తేనే కరోనాను ఎదిరించగలము.  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కరోనా సంక్షోభంలో నిత్యావసర ధరలు పెరగకుండా చూడాలి అని చెప్పారు.  ప్రపంచంలో అన్ని దేశాలకు మరియు రాష్ట్రాలకు ఈ మహమ్మారి ముప్పు ఒకేలా పొంచి ఉంది. కాబట్టి ఇ ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రజలంతా భాగస్వాములు అవ్వాలి.  ఎవరు కూడా భయాందోళనకు గురి కాకూడదు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి “అణుమాత్రం కూడా  అలసత్వం వద్దు ”  అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఈ కరోనా అనే మహమ్మారిని నివారించేందుకు కేంద్రం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన నేపథ్యంలో.  అందరూ క్షేత్ర స్థాయిలో ఈ చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తయారుగా ఉండాలి. అని ప్రధాని మోదీగారు వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రతీ సుదన్ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి చర్యలను చేపట్టిందో వివరించారు.
మార్చి 20 నాటికి కరోనా అని మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 2,45,484 మందికి సోకగా భారత్లో 234 మందికి సోకింది.   ఇందులో భారత్ లో మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 10,038 కాగా భారతదేశంలో నలుగురు భలిఅయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా  ఈ మహమ్మారి నుండి కోలుకున్నవారు 86,035 కాగా మన దేశంలో 22 మంది .

LEAVE A REPLY