రూపాయి – నీ విలువ దిగజారుతుందా … ?

19
does-value-of-rupee-falling-down
does-value-of-rupee-falling-down

మనం చిన్నప్పుడు చదుకున్నాము మన అందరికి తెలుసు. భూమి తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని కానీ దాన్ని మార్చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇంకొక నానిడి  చెప్పారు. భూమి తన చుట్టూ తానూ తిరుగుతూ డాలర్ చుట్టూ తిరుగుతుంది అని చెప్పారు.

డాలర్…డాలర్ నీ విలువ ఎంత అని అడిగితే మీ దేశ కరెన్సీ తో పోల్చుకొని చూడు నా విలువ ఏంటో చెప్తాను. నేను ఎంత గొప్పనో చెప్తాను అని ఒక రచయిత ఎన్నడో చెప్పారు.

ఇప్పుడు చూసుకుంటే కోవిడ్ -19 సంక్షోభం దృష్ట్యా చాలా దేశాల కరెన్సీ వాల్యూ పడిపోతుంది. ఆసియా ఖండంలోని దేశాలలో కరెన్సీ వాల్యూ పడిపోవడం జరుగుతుంది. మన దేశంలో కూడా రూపాయి విలువ పడిపోతుంది. డాలర్ విలువ పెరుగుతుంది.

అసలు ఈ విలువ అంటే ఏమిటి ?

కరెన్సీ విలువ అనేది ఒక పోలిక (comparison ). ఆలోచిస్తే 1960-1970 కాలంలో రూపాయి డాలర్ గురించి ఎక్కువగా పట్టించుకునేవాళ్ళం కాదు కానీ 1991 లో globalization అయినా తర్వాత మన దేశ రాబడులు మరియు చెల్లింపులు కానీ డాలర్ రూపంలో చెల్లించాల్సి వచ్చేసరికి రూపాయి డాలర్ మారకు విలువ గురించి ఎక్కువగా ఆలోచించాల్సి వచ్చింది.

2000-2010 సంవత్సరం వరకు దాదాపు 1 డాలర్ = 40 రూపాయిలు ఉండేది. 2010-2020 కీ వచ్చేసరికి 1 డాలర్ =50-60 రూపాయలుగా వుండి ప్రస్తుతం 77.85 పైసలు (నిన్నటికీ ) అంటే ఒక డాలర్ కొనాలి అంటే 2010 లో 40 రూపాయిలు చెల్లిస్తే సరిపోయేది కానీ ఇప్పుడు ఒక డాలర్ కొనాలంటే 77 రూపాయి చెల్లించాలి.

దాదాపు రెట్టింపు అయిపొయింది. అంటే రూపాయి విలువ తగ్గుతూ వచ్చింది. డాలర్ విలువ పెరుగుతూ వచ్చింది. దీంతో ఇండియా యొక్క exports పెరుగుతాయి.అదే రివర్స్ లో ఆలోచిస్తే ఇండియా యొక్క imports బిల్స్ చాలా పెరిగిపోతుంది. ఇండియా కీ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా   ఉంటాయి.

రూపాయి విలువ తగ్గితే…

రూపాయి విలువ తగ్గితే మనకీ చాలా కష్టమవుతుంది. అదృష్టం కొద్దీ ఈ సమయంలో ఆయిల్ ధరలు కూడా తగ్గాయి కాబ్బటి కొంత  వెసులుబాటు వుంది. ఇండియా రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది అంటే ప్రపంచంలో పెట్టుబడిదారులందరు కూడా ఈ చిన్న చిన్న దేశాలలో నమ్మకం తగ్గించుకుంటాయి.

అమెరికా వంటి దేశాల పైన నమ్మకం పెట్టుకుంటున్నాయి. ఎవరికైనా బిజినెస్ చేసే వారికి సేఫ్ మార్కెట్ మీద ధ్యాస ఉంటుంది. అమెరికా ఎంత అతలాకుతలం అయినా అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఇంకా బలంగా ఉందని అందరూ నమ్ముతున్నారు.

Read Also: జీతాలలో కోత …!

ఇండియా డొమెస్టిక్ ఈక్విటీ మర్కెట్స్ పడిపోతున్నాయి. ఇండియాలోనే కాదు ఆసియా ఖండంలోని ఇతర దేశాలలో కూడా ఇదే పరిస్థితి వుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ (consumer spending) అంటే వినియోగదారులు ఎక్కువ ఖర్చు పెడితేనే నడుస్తుంది. 2/3 వంతు అమెరికా ఆర్థిక వ్యవస్థ వినియోగదారుల పై ఆధారపడి ఉంటుంది.

అమెరికా లో ఇంకా డబ్బులు  ఉన్నాయి  కాబ్బటి అందరూ డాలర్ ని నమ్ముతున్నారు. 60 సంవత్సరాల కాలంలో ఆసియా ఖండం లో కరెన్సీ ఇంత తక్కువ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి కావచ్చు.

రూపాయి విలువ ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి.

LEAVE A REPLY