హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికీ జియో ట్యాగ్ …!

34
geo tag for home quarantine
geo tag for home quarantine

హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికీ జియో ట్యాగ్ …!

టీఎస్ కాప్ యాప్ లో ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసారు .గస్తీ సిబ్బంది అనునిత్యం గమనించేలా  ఏర్పాటు చేశారు.నిర్దిష్ట  ప్రాంతం దాటి బయటకి వస్తే వెంటనే సమాచారం అందేలా టీఎస్ కాప్ యాప్ కీ జియో ట్యాగ్ ద్వారా అనుసంధాము చేశారు.

విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారానే మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం తో  వారిని హోమ్ క్వారంటైన్ చేసారు.విదేశాల నుండి వచ్చిన వారికి విమానాశ్రయాల్లోనే స్టాంపింగ్ చేస్తున్నారు.నిర్ణిత గడువు ముగిసే వరకు వారు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. అయినా కొంతమంది విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు నిబంధనల్ని ఉల్లంగిస్తున్నారని పోలీస్ లకు సమాచారం అందుతుంది .ఈ కారణంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారిపై పటిష్ట నిఘా కోసం సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు .

జియో ట్యాగ్ చేయడానికి హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారిని గమనించడానికి తెలంగాణ పోలీస్ అధికారిక యాప్  టీఎస్ కాప్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను పోలీస్ విభాగం సేకరించింది.ఈ జాబితాను స్టేషన్ ల వారీగా అధికారులకు అందించింది. హోమ్  క్వారంటైన్ లో ఉన్న వారి చిరునామాలను గస్తీ సిబ్బంది సరిచూస్తున్నారు ఆ ఇంటిని అక్షాంశాలు  రేకాంశాల ఆధారంగా జియో ట్యాగింగ్ చేస్తున్నారు.క్వారంటైన్  అయినా వ్యక్తి ఫోన్ నెంబర్ ను అనుసందానం చేస్తున్నారు .22 వేల మంది వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా టీఎస్ కాప్ యాప్ లో లింక్ ద్వారా పొందుపరిచారు .

ఫలితనంగా అనునిత్యం ఆ ఇళ్ళను, క్వారంటైన్ అయినా వ్యక్తుల్ని పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది .ఈ విదంగా క్వారంటైన్ అయినా వ్యక్తులు తమ ఇళ్ళ నిండి 50మీటర్లు వెళితే ఆ విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా పోలీస్ విభాగం తక్షణం గుర్తిస్తుంది.క్వారంటైన్ అయినా వ్యక్తి పరిధిని దాటడం టీఎస్ కాప్ యాప్ ద్వారా కంట్రొల్ రూమ్ సిబ్బందికి తెలుస్తుంది. గస్తీ సిబ్బంది ద్వారా బయటకి వచ్చిన క్వారంటైన్ అయినా వ్యక్తిని  అదుపులోకి తీసుకోని ప్రస్తుతం అమలులో ఉన్న చర్య తీసుకుంటుంది .

LEAVE A REPLY