లాస్ ఏంజిల్స్ చేరుకున్న అతిపెద్ద నౌక ఆసుపత్రి !

62
giant US Hospital ship
giant-US-Hospital-ship

అతిపెద్ద భారీ నౌక ఆసుపత్రి శుక్రవారం లాస్ ఏంజిల్స్ కి  చేరుకుంది. ఇది యు ఎస్ నగరంలోనే 1000 పడకల సామర్థ్యం గల అతి పెద్ద ఆసుపత్రిగా అవతరించబోతుంది.

ఈ భారీ నౌక ఆసుపత్రిలో 894 అడుగుల ఆయిల్ ట్రాంకేర్, రోగులకు 15 వార్డులు, 5000 లీటర్ల  బ్లెడ్ బ్యాంక్ సామర్థ్యం వుంది.

కానీ ఈ నౌక ఆసుపత్రిలో కరోనా బాదితులను చేర్చుకోరు.నగరం లో గాయపడ్డ వారిని, ఇతర రోగాలతో ఇబ్బందిపడుతున్న సాధారణ రోగులను మాత్రమే ఈ నౌక ఆసుపత్రిలో చేర్చుకుంటారు.

దీనికి గల కారణం, నగరం లో రోగుల వత్తిడిని తగ్గించడానికి మాత్రమే ఈ భారీ నౌక ఆసుపత్రిని ఉపయోగిస్తారు.

అమెరికా లో కరోనా మహమ్మారి విజృంభణ ఎక్కువగా వుంది. భాదితుల సంఖ్య చైనా దాటిపోయి అతిపెద్ద కరోనా బాధిత దేశంగా మారిపోయింది.

ఇప్పటివరకు 83,000 మంది కి పైగా కరోనా బారిన పడ్డారు. అంతేకాదు కరోనా బాధితులకు సేవలందిస్తున్న వారికీ కూడా ఈ మహమ్మారి వ్యాపిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.

ఒక్క లాస్ ఏంజిల్స్ లోనే గురువారం 400 కు పైగా కరోనా కేసులు నమోదుకాగా 9 మంది మరణించారు. నగరంలో అన్ని ఆసుపత్రులలో రోగులతో నిండిపోతుంది.

కరోనా కారణంగా 33,000 మంది అమెరికా నిరుద్యోగులు తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఇది ఇప్పటివరకు ఉన్న రికార్డులకు  5 రెట్లు అధికంగా ఉందని అగ్రరాజ్యం తేల్చిచెప్పింది.

 

LEAVE A REPLY