జీతాలలో కోత …!

79

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులు,ప్రజాప్రతినిధుల జీతాలలో కోత విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ విస్తరణ తీవ్ర ప్రభావ చూపుతున్న కారణంగా ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలన్నిటిలోనూ కోత విధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవనంలో ఉన్నత అధికారులతో సమీక్షించిన తదనంతరం వేతనాల్లో కోతకి ఆమోదం తెలిపారు.

ఇలాంటి క్లిష్ట సమయం లో ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సి అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి వర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఆఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60శాతం కోత విధించారు. వివిధ కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50శాతం కోత విధించారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల్లో 10శాతం కోత విధించారు. ఈ జీతాలలో కోత ప్రస్తుతం మార్చి నెలకి మాత్రమే అని ముఖ్యమంత్రి తెలిపారు.

తెలంగాణాలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులు వున్నారు. ఇందులో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది. 2.5లక్షల మంది ఫింఛనుదార్లు ఉన్నారు .ఉద్యోగులు ఫింఛనర్లకు జీతభత్యాల కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ. 3500 కోట్లు విధుల చేస్తుంది. ఈ వేతనాల్లో కోత వల్ల ప్రభుత్వానికి రూ.1700 కోట్లు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది.

LEAVE A REPLY