ప్రముఖ నటుడు కమల్ హాసన్ తనపై వస్తున్న కరోనా పాజిటివ్ వదంతుల గురించి స్పందించాడు. కొన్ని రోజులుగా తనపైన వస్తున్న కరోనా పాజిటివ్ వదంతులు నిజం కాదని వాటిని ఎవ్వరు కూడా నమ్మొద్దని అధికారికంగా లేఖ రాసారు.
కమల్ హాసన్ రాసిన లేఖలో …
తాను కొన్ని సంవత్సరాలుగా తన పాత ఇంట్లో నివసించడం లేదని , పార్టీ ఆఫీస్ మక్కల్ నీది మాయమ్ కూడా అక్కడినుండి పనిచేస్తోందని అందరికి తెలిసిన విషయమే.
కాబట్టి నాకు కరోనా లేదు, నేను నిర్బంధం లో వున్నాను అని వస్తున్న వదంతులు నిజం కాదని అని రాసారు కమల్ హాసన్ .
నేను కూడా సామజిక దూరని పాటిస్తున్నామని, అలాగే అందరు కూడా ముందస్తు జాగ్రత్తగా సామాజిక దూరాన్ని పాటించాలని రాసారు.
అలాగే మీడియా విలేకరులు, వార్త ఏజెన్సీ లు వచ్చే వదంతులతో నిజం ఎంత ఉందొ తెలుసుకొని ప్రచురించాలని రిక్వెస్ట్ చేస్తూ రాసారు .