లిక్కర్, బీర్ తయారీకి వారం రోజులు గడువు …!

32
liquor-making-permit

లిక్కర్, బీర్ తయారీకి అనుమతి ఇవ్వాలని అని ప్రభుత్వానికీ  లిక్కర్ కంపెనీలు లేఖ అందించాయి. దాదాపు 200 కోట్ల రూపాయిల విలువ చేసే ముడిసరుకు రెడీగా ఉందని లేఖ లో పేర్కొన్నాయి. లాక్ డౌన్ ఎన్ని రోజులు  ఉంటుందో తెలియక ముడి సరుకు నిల్వ చేశాము అన్నారు.

ఈ ముడిసరుకుతో బీర్లు, లిక్కర్లు తయారు చేయడానికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం వారం రోజుల పాటు టైం ఇస్తే ఉత్పత్తి చేసుకుంటాము ఆ తర్వాత లాక్ డౌన్ లో భాగంగా ఉత్పత్తి నిలిపి వేస్తామని తెలిపారు.

రాష్ట్రం లో మొత్తం 14 లిక్కర్ కంపెనీలు వున్నాయి. ఇవి నెలకి 45 లక్షల కేసుల లిక్కర్ ఉత్పత్తి చేస్తాయి. బీర్లు తయారు చేసే కంపెనీలు 6 ఉన్నాయి. ఇవి నెలకి 52 లక్షల కేసులు ఉత్పత్తి చేస్తాయి. ఫిబ్రవరి నుండి జూన్ వరకు అయితే 77 లక్షల బీర్లు ఉత్పత్తి చేస్తామని తెలిపారు. అన్ని కంపెనీలు కలిపి సుమారు 4 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రోజుకు 324 కోట్ల నష్టాల్లో లిక్కర్ , బీర్ కంపెనీలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు లాక్ డౌన్ తర్వాత లిక్కర్ , బీర్ల పైన వేసే టాక్స్ తగ్గించాలని కోరారు అసోసియేషన్ సభ్యులు.

Read  also: రూపాయి ; నీ విలువ దిగజారుతుందా … ?

వైన్స్ ,బీర్ల షాపుల్లో  సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎక్సయిజ్ పోలిసుల సహకారం తో రోజుకు 4-5 గంటల పాటు అమ్మకాలు చేపట్టేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రము లో మొత్తం 2216 వైన్ షాపులు వున్నాయి.బార్ అండ్ రెస్టారెంట్స్ 276 వరకు వున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్స్ నడపకపోయిన వైన్స్ కి అనుమతి ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం రోజుకు 70 కోట్ల ఆదాయం అందుతుంది.అదేవిధంగా నెలకి 2001 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి చేరుతుంది.అనుమతి ఇవ్వడం వలన మాకు మా పైన ఆధార పడిన 4 లక్షల మందిని ఆదుకునే ఆవకాశం ఉంటుందని పేర్కొన్నారు.దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

రాష్ట్ర ప్రభుత్వానికి 2 ప్రధాన ఆదాయ వనరులు వున్నాయి.

అవి

  1. డీజీల్ ,పెట్రోల్ ద్వారా 30% ఆదాయం ప్రభుత్వానికి  అందుతుంది.

2. లిక్కర్ , బీర్ల ద్వారా 70% ఆదాయం ప్రభుత్వానికి అందుతుంది.

ఈ అనుమతి ఇస్తే వైరస్ వ్యాప్తి చెందే ఆవకాశం ఎక్కువగా ఉంటుంది కాబ్బటి ఎలాంటి  అనుమతి ఉండకపోవచ్చు అని ఎక్సయిజ్   అధికారులు తెలిపారు.

 

LEAVE A REPLY