మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సృష్టించిన కరోనా వైరస్…!

9
uddhav thackeray

కరోనా వైరస్ మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సృష్టిస్తుంది. దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర సతమతమవుతుంటే మరోవైపు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభంలో కురుకుపోతుంది. మరో నెల రోజుల్లో  ఉద్ధవ్ థాక్రే  చట్టసభ సభ్యుడు కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకతప్పని పరిస్థితి.కొన్ని సంక్షోభాలు కొత్త సంక్షోభాలను సృష్టిస్తాయి మహారాష్ట్రలో అదే జరుగుతుంది.

మహారాష్ట్ర కరోనా హాట్స్ స్పాట్ గా మారిపోయింది. కరోనా కేసులు మరియు మరణాల్లో మొదటి స్థానం లో ఉంది. మూడవ దశ వ్యాప్తి కూడా ఎక్కువగా ఈ రాష్ట్రంలోనే ఉంది. కరోనా ఎలా నియంత్రించాలో అర్ధం కాక ప్రభుత్వం అధికారులు తలపట్టుకుంటున్నారు. అయితే కరోనా ని మించిన రాజకీయ సంక్షోభం ఉద్ధవ్ థాక్రే చుట్టూ తిరుగుతుంది. సీఎం గా థాక్రే భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

మే 28 తర్వాత థాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే రాజ్యాంగ సంక్షోభాన్ని దాటాలి కానీ ఆ పరిస్థితులు మాత్రం కనిపించం లేదు. ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర శాసన సభలో కానీ శాసన మండలి లో గానీ సభ్యులు కారు. ఎన్నికల్లో ఏ పార్టీ కి స్పష్టమయిన మెజార్టీ రాకాపోవడం, బీజేపీ, శివసేనా మధ్య విభేదాలు రావడం చివరికి కాంగ్రెస్, ఎన్సిపి తో కలిసి శివసేనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి.

ఇదీ కూడా చదవండి : Sunny Leone Latest Photo Gallery

మహాకూటమి అధినేతగా పోయిన ఏడాది నవంబర్ 28న ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టారు ఉద్ధవ్ థాక్రే. ఆయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే మొదటిసారి. రాజ్యాంగం ప్రకారం థాక్రే 6 నెలల వ్యవధిలో చట్ట సభలకు ఎన్నిక అవ్వాలి. సాధారణ విషయంలో ఇది పెద్ద విషయం కాదు. థాక్రే కావాలనుకుంటే ఏదైనా స్థానం నుండి పోటీ చేసి గెలవవచ్చు లేదా శాసన మండలిలో ఏదో ఒక కోటాకి నామినేట్ కావచ్చు. కరోనా సంక్షోభం లేకపోతే ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగిపోయేది. అయితే కరోనా ఉద్ధవ్ థాక్రే భవిష్యత్తుకు అడ్డుగోడగా నిల్చింది.

షెడ్యూల్ ప్రకారం మార్చ్ 26న మహారాష్ట్ర లో శాసన మండలి ఎన్నికలు జరగాలి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలనీ థాక్రే నిర్ణయించుకున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా మండలి ఎన్నికలు ఎన్నికల సంఘం నిరవధిక వాయిదా వేసేసింది.దీంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. రాజు తలుచుకుంటే ఏదైనా  చేయొచ్చు కదా అనుకున్నా థాక్రే  ప్లాన్-బి సిద్ధం చేసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేగా నామినేట్ కావాలని థాక్రే భావించారు. గవర్నర్ ఒక సంతకం పెడితే చాలు థాక్రే క్షణాల్లో ఎమ్మెల్సీ గా మారిపోతారు.

కానీ రాజ్ భవన్ కూడా అడ్డుపడింది. మహారాష్ట్ర గవర్నర్ B K కొశ్యారీ ఢిల్లీ మనిషీ పైగా బీజేపీ తో తెగదెంపులు చేసుకున్న శివసేనాకి ఆయన సహకరించే ఆవకాశం లేదు. గవర్నర్ కోటాలో థాక్రే ని నామినేట్ చేయాలనీ మహారాష్ట్ర మంత్రి మండలి  తీర్మానాన్ని గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదించలేదు.

వాస్తవానికి వివిధ రంగాల్లో సామాజిక సేవలు చేసిన వారికి మాత్రమే గవర్నర్ కోటా కింద నామినేట్ చేస్తారు. రాజకీయ నాయకుడిని నామినేట్ చేయకూడదు అనే రూల్స్ ఏమి లేకపోయిన గవర్నర్ విచక్షణ అధికారమే ఇక్కడ కీలకం. రాజ్ భవన్ రాజకీయాలు చేస్తుందంటూ శివసేన విమర్శిస్తున్న కొశ్యారీ పట్టించుకోవడం లేదు.

దీంతో ఉద్ధవ్ థాక్రే భవిష్యత్తు త్రిశంఖు స్వర్గంలో వుంది. మే 28 లోపు శానస సభ సభ్యుడిగా మారకపోతే ఉద్ధవ్ థాక్రే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. శాసన సభ లేదా శాసన మండలి సభ్యత్వం లేని వ్యక్తి 6 నెలల కంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ – 164 క్లాజ్ – 4 అంగీకరించదు.

LEAVE A REPLY