ఉద్యోగులను విధులనుండి తొలగించకూడదు…! ప్రధాని మోదీ 7 సూత్రాలను

48
modi 7 point formula

దేశ ప్రజల కృషి వల్లనే కరోనా నియంత్రణలో వుంది. ఎన్ని కష్టాలున్నా దేశం కోసం ప్రజలు నిలబడ్డారు. కరొనపై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. పండగలను కూడా సంయమనంతో జరుపుకున్నారు.

లాక్ డౌన్ తో ప్రజలకు తినడానికి మరియు ప్రయాణాలకు ఎన్నో ఆటంకాలు కలుగుతున్న ప్రజలందరూ ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి అన్నీటికీ సిద్ధపడ్డారు. కరోనా పై భారత్ పోరాటాన్ని ఏ ఇతర దేశాలతో పోల్చకూడదు. ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా పోరాడుతున్నాడు. కరోనా పై భారత్ లో యుద్ధం కొనసాగుతుంది అని మోదీ అన్నారు .

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటలకు విలువను ఇఛ్చిన ప్రధాని మోదీ లాక్ డౌన్ ను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా వున్నా పరిస్థితులను గమనిస్తే మే 3 వరకు లాక్ డౌన్ పొడగించాల్సిందే అని నిర్ణయించారు. ఈ లాక్ డౌన్ కి సంబందించిన నియమాలను రేపు ప్రధాని మోదీ ప్రకటించనున్నారు.

Read also: కరోనా అంటే ఏమిటి? ఎలా నివారించ వచ్చు?

ఈ నెల 20 వరకు మాత్రం కఠినంగా లాక్ డౌన్ ను అమలుపరచాల్సిందిగా ఆదేశించారు. తరువాత అత్యవసరాలను దృష్టిలోవుంచుకొని కొన్ని సడలింపులు చేయనున్నారు. ఈ కరోనా మహమ్మారికి సమూలంగా నాశనం చేయడానికి వాక్సిన్ కనుక్కోవడానికి మన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని మోదీ తెలిపారు.

ఈ కరోనా ని నియంత్రించడానికి మన ప్రధాని మోదీ గారు 7 సూత్రాలను ప్రతిపాదించారు.

1. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

2. సామాజిక దూరం, లాక్ డౌన్ పాటించాలి. మాస్క్ లను తప్పకుండ వాడాలి.

3. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ఆయుష్ విభాగం సూచించిన ఆహారం తీసుకోవాలి.

4. కరోనా పై అవగాహనకు ఆరోగ్య సేతు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

5. వీలైనంత వరకు పేదలకు సహాయం చేయండి

6. ఉద్యోగులను విధుల నుండి తొలగించకూడదు.

7. కరోనా పై పోరాటం లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య  సిబ్బందులకు ధన్యవాదాలు చెప్పండి.

Read also: కరోనా వైరస్ వ్యాప్తి పై ప్రజలకు, మీడియాకు సూచనలు!

LEAVE A REPLY