ఒలింపిక్ క్రీడల కొత్త తేదీల ప్రకటన :
కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా వచ్చే సంవత్సరానికి వాయిదా పడిన ఒలింపిక్స్ క్రీడల కొత్త తేదీలను అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ప్రకటించింది.
ఈ జూలై 24 న ప్రారంభమై ఆగష్టు 9 వరకు జరగాల్సిన క్రీడాలను 2021లో జులై 23 – ఆగష్టు 8 తేదీల మధ్య నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఒసి),ఆతిధ్య జపాన్ నిర్ణయించాయి. ఈ టోక్యో ఒలింపిక్స్ ను వచ్చే సంవత్సరానికి వాయిదా వేయడం వల్ల బిలియన్ డాలర్ల నష్టం భరించాల్సి వస్తుందని ఒలింపిక్ కమిటీ అంచనా వేస్తుంది.
ఒలింపిక్స్ కోసం జపాన్ లక్షల కోట్లకు పైగానే ఖర్చు చేస్తోంది. ఒలింపిక్ క్రీడాలు వాయిదా వల్ల ఈ ఖర్చు భారీగానే పెరుగుతుందని క్రీడాల నిర్వాహక అధ్యక్షుడు మొషిరో మోరీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు కూడా డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940 లో జపాన్ నిర్వహించాల్సిన ఒలింపిక్స్ క్రీడాలు వాయిదా పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు 56 సంవత్సరాల తర్వాత జపాన్ కు ఒలింపిక్స్ క్రీడాల ఆతిధ్యానికి ఆవకాశం వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు కరోనా వైరస్ విస్తరణ కారణంగా వాయిదా వేయాల్సి వస్తుందని జపాన్ వాపోతుంది.