ఆపత్కాలంలో ఆదుకున్న వారికి ధన్యవాదాలు | పవన్ కళ్యాణ్

98
pavan kalyan thank to who donated

ఆపత్కాలంలో పెద్ద మనసు చాటుకొంటున్న సినిమా కుటుంబానికి ధన్యవాదాలు – జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మన ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే ఈ లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న రోజు వారి సినీ కార్మికులకు అండగా నిలిచి తమవంతు విరాళాలను అందచేసిన వారందరికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియచేసారు.

కరోనా మహమ్మారి విజృంభించిన ఆపత్కాలమిది. ఈ సమయంలో ప్రభుత్వానికి… ప్రజలకు… సినీ కార్మికలోకానికి అండగా నిలిచి పెద్ద మనసు చాటుకొంటున్న సినిమా కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ తరుణం లో ఇక్కట్లలో ఉన్నవారికి బాటసాగా నిలిచేందుకు నిధులు చాలా అవసరం. అగ్రశ్రేణి హిందీ కథానాయకుడు శ్రీ అక్షయ్ కుమార్ రూ. 25 కోట్లు ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ కరోనా క్రైసిన్ చారిటి (సి సి సి ) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నవారికి ఆదుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాల సంతోషించాను ఇది ఆహ్వానించదగ్గా పరిణామం.

కమిటీ చైర్మన్ గా వున్నా పెద్దన్నయ్య శ్రీ చిరంజీవి గారికి, కమిటీ సభ్యులు శ్రీ సురేష్ బాబు, యన్ శంకర్, సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ బెనర్జీ, తమ్మారెడ్డి భరద్వాజ గార్లకు అభినందనలు తెలిపారు.

ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కరోనా క్రైసిన్ చారిటి (సి సి సి )కి అందచేసిన విరాళాలు తెలియజేస్తూ

చిరంజీవి  –  ఒక కోటి రూపాయలు

రామ్ చరణ్  –  30 లక్షలు

సురేష్ బాబు, రానా, వెంకటేష్  కుటుంబం  – ఒక కోటి రూపాయలు

ఎన్టీఆర్   –  25 లక్షలు

మహేష్ బాబు   –  25 లక్షలు

నాగ చైతన్య   –  25 లక్షలు

వరుణ్ తేజ్   –  20 లక్షలు

సాయి ధర్మతేజ్   –  10 లక్షలు

రవితేజ   –  20 లక్షలు

శర్వానంద్   –  15 లక్షలు

కార్తికేయ   –  2 లక్షలు

వెన్నెల కిశోర్   –  2 లక్షలు

శిరీష్, దిల్ రాజ్,   –   10 లక్షలు

లావణ్య త్రిపాఠి   –  1 లక్ష

వైజయంతి ఫిలిమ్స్ నుంచి అశ్వినీ దత్ – 10 లక్షలు

రూపాయలు కరోనా క్రైసిన్ చారిటి (సి సి సి ) కి ఇఛ్చి ఈ కరోనా మహమ్మారి విపత్తు వేళా సినీ కార్మికులకు బాసటగా నిలిచారు. సామాజిక భాద్యతహా సహాయం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు.

యువ కథానాయకుడు నిఖిల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రులలో వైద్యులకు ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, గ్లోవ్స్ లు , శానిటైజర్లు, ప్రొటెక్ట్ గ్లాస్ లు అందచేయడం చాల సంతోషం.

యాంకర్ ప్రదీప్ టీవీ రంగ కార్మికులకు నెల రోజులపాటు ఆర్ధిక సాయం చేస్తాను అని ప్రకటించటం చాల సంతోషించదగ్గ విషయం తనకి అభినందనలు తెలిపారు. ఆపత్కాలంలో ఆదుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

 

LEAVE A REPLY