73% పెర‌గ‌నున్న‌ భార‌త కుభేరుల సంఖ్య‌…

61
Richest persons in India

నైట్ ఫ్రాంక్ నివేదిక ప్ర‌కారం రెండో అతిపెద్ద సంప‌ద కేంద్రంగా ఆసియా.భార‌త్‌లో అత్యంత శ్రీ‌మంతులు (అల్ట్రారిచ్‌) సంఖ్య 2024 నాటికి భార‌త‌దేశంలో కుభేరుల సంఖ్య 73 శాతం పెరుగుతుంద‌ట‌. ఓ వైపు అంత‌ర్జాతీయ భౌగోళిక ఆందోళ‌న‌లు,వృద్ది నెమ్మ‌దించొచ్చు అన్న అంచ‌నాల మ‌ధ్య దేశంలో కుభేరుల సంఖ్య ఇంత గ‌ణ‌నీయంగా పెర‌గ‌నుండ‌టం ఆశ్చర్యమే. స్థిరాస్థి క‌న్స‌ల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఈ స‌ర్వేలో రెండు వంద‌ల కోట్లు (30 మిలియ‌న్ల డాల‌ర్లు) పైగా ఉన్న‌వారిని అల్ట్రారిచ్ గా ప‌రిగ‌ణించింది. 2022 క‌ల్ల భార‌త జిడిపి తిరిగి 7 శాతానికి చేర‌వ‌చ్చ‌న్న అంచ‌నాల‌లో శ్రీమంతుల సంఖ్య కూడా ఈ స్థాయిలోనే పెర‌గ‌వ‌చ్చ‌ని నైట్ ఫ్రాంక్ చైర్‌మ‌న్ , ఎం.డి శ‌శిర్ బైజాల్ తెలిపారు.
ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మంద‌గ‌మ‌నం సాగుతున్న‌ప్ప‌టికి దీర్గ‌కాలంలో బ‌ల‌మైన వృద్ది న‌మోద‌వుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నావేస్తున్నార‌ని ఈ స‌ర్వేలో తెలిపారు. 2019లో భార‌త్‌లో అత్యంత కుభేరులు 5986 మంది ఉండ‌గా… 2024 నాటికి 10,354తో రెట్టింపుకు చేరొచ్చు. 2024 నాటికి ఐరోపాను వెన‌క్కినెట్టి 2వ అతిపెద్ద సంప‌ద కేంద్రంగా ఆసియా ఆవిర్బ‌వించ‌నుంది.

LEAVE A REPLY