ట్రంప్ ను ఉతికి ఆరేసిన హాలివుడ్ దర్శకుడు…!

44
ట్రంప్ ను ఉతికి ఆరేసిన హాలివుడ్ దర్శకుడు...!

ట్రంప్ ను ఉతికి ఆరేసిన హాలివుడ్ దర్శకుడు…

కరోనా వైరస్ తలుపు తడుతున్నప్పుడుగానీ, విజృంభించి విలయతాండవ చేస్తున్నప్పుడుగానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు విమర్శలకు గురైంది. వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం, తాను చేసిందే సరైందని వాదించడం వంటివి ముఖ్యంగా జనం ఆగ్రహానికి కారణమయ్యాయి.

ఒక దశలో లాక్‌డౌన్ ఎత్తివేస్తానని ఆయన చేసిన ప్రకటన కరోనా కల్లోలానికి ఆజ్యం పోసింది. ఇప్పుడు అమెరికా కరోనా వైరస్‌కు ప్రధాన లక్ష్యంగా మారడం చూసినవారు ఆయనపై మండిపడుతున్నారు. తాజాగా ప్రముఖ హాలివుడ్ దర్శకుడు రిడ్లే స్కాట్ అమెరికా అధ్యక్షునిపై మండిపడ్డారు.

అమెరికాను కరోనా కుంపట్లోకి దింపిన ట్రంప్‌ను, స్వయంగా కోరనాకు గురైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆయన ఎండగట్టారు. కరోనా సంక్షోభంలో ఇద్దరి నాయకత్వం దిగదుడుపుగా ఉందని వెరైటీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో రిడ్లే స్కాట్ దుయ్యబట్టారు.

ఏలియన్, గ్లాడియేటర్, బ్లేడ్ రన్నర్, మార్షియన్ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన స్కాట్ వయసు 82 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన లాస్ ఏంజెలిస్‌లో ఉంటున్నారు.

“మనల్ని నడిపిస్తున్న నారింజరంగు జుత్తు (ట్రంప్) ఓ పిచ్చి వ్యహారం కదూ”

అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో సగం మంది నేతలు తిక్కోళ్లు.. మిగతా సగం మంది నియంతలు.. కాస్త లెక్కలోకి తీసుకోదగ్గవాళ్లు చాలా కొద్దిమందే ఉన్నారు అని నిర్వేదం వ్యక్తం చేశారు. సగం బుర్ర వాళ్లైనా రాజకీయాల్లోకి వెళ్లాలనుకోరు అని వ్యాఖ్యానించారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమాయకి కొంచెం ముందుగా జన్మించిన స్కాట్ కరోనా భయంతో జనం సరుకులు ఎడాపెడా కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు. అందులో సగం మురిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పోవాలంటే ప్రపంచయుద్ధం రోజుల్లాగా మళ్లీ సరుకులకు రేషనింగ్ పెట్టాలని అభిప్రాయపడ్డారు.

లాక్ డౌన్ మొదలయ్యే సమయానికి స్కాట్ లాస్ట్ డ్యుయెల్ అనే సినిమా తీస్తు న్నారు. మ్యాట్ డేమన్, బెన్ ఆఫ్లెక్ నటిస్తున్న ఆ చిత్రం షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది.

LEAVE A REPLY