టెస్కాబ్ అధ్య‌క్షునిగా కొండూరి రవీందర్ రావు…

18
టెస్కాబ్ అధ్య‌క్షునిగా కొండూరి రవీందర్ రావు...
Telangana State Co-operative Apex Bank pesident Ravinder rao

టెస్కాబ్ అధ్య‌క్షునిగా కొండూరి రవీందర్ రావు, ఉపాధ్యక్షుడిగా గొంగిడి మ‌హేంద‌ర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక. ప్ర‌స్తుత‌ తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా ఉన్న,కరీంనగర్ (రాజన్న సిరిసిల్ల)కు చెందిన కొండూరి రవీందర్ రావు మరోసారి టెస్కాబ్ అధ్య‌క్షునిగా ఎన్నికయ్యారు. హైదరాబాదులోని టెస్కాబ్ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో సంస్థ డైరెక్టర్లు ఆయనను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.
గజ సింగవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షునిగా కరీంనగర్ డిసిసిబి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా గెలిచిన రవీందర్ రావును టెస్కాబ్ చైర్మన్ అభ్యర్థిగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ సిఫారసు చేయగా సీఎం కెసిఆర్ ఆమోదించినట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గొంగిడి మహేందర్రెడ్డి మాత్రమే నామినేషన్ వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు తెలిపారు వ్యవసాయం సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్ష ,ఉపాధ్యక్షల‌ను అభినందించారు

LEAVE A REPLY