తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్…

14
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్ ...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్ ...

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్… తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్) సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. గతంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన రజత్ కుమార్ ను ప్రభుత్వం నీటిపారుదల శాఖకు బదిలీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన జాబితాను పంపింది. శశాంక్ గోయల్ కు ఈ సి ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా శశాంక్ గోయల్ నియమించింది.