టోక్యో ఒలంపిక్స్ 2020 వాయిదా…

68
Tokyo Olympics 2020
Tokyo Olympics 2020

టోక్యో ఒలంపిక్స్ 2020 వాయిదా…
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టోక్యో 2020 ఒలింపిక్స్, 2021 నాటికి వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం (ఐఓసి) ప్రకటించింది. జపాన్ ప్రధానమంత్రి షింజో అబె, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ చర్చల తదనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జులై 24న క్రీడలు ప్రారంభం కావాల్సి ఉంది.

2021లో జరిగే ఒలంపిక్స్ ను 2020 ఒలంపిక్స్ అనే పిలుస్తారు.

శాంతి నెలకొన్న సమయంలో ఒలంపిక్స్ ని వాయిదా వేయడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒలంపిక్స్ వాయిదా వేస్తున్నట్లు థామస్ బాక్ మరియు షింజో అబే ప్రకటించారు. కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్రీడలను వాయిదా వేయాలని క్రీడా సంఘాలు డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కెనడా ఆస్ట్రేలియా క్రీడల నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం, యు య‌స్‌ ఒలంపిక్ కమిటీ వరల్డ్ అథ్లెటిక్స్ కూడా వాయిదా వేయాల్సిందేనని పట్టుబట్టడంతో ఐఓసీ తన నిర్ణయాన్ని త్వరగా ప్రకటించక తప్పలేదు.
కరోనా సోకుతుందన్న భయం కారణంతో అథ్లెట్లు ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. చాలా దేశాల్లో స్టేడియాలు మూసివేశారు. చాలా టోర్నీలు ఒలంపిక్ క్వాలిఫైయర్స్‌ రద్దయ్యాయి. వివిధ దేశాల్లో ఆంక్షల కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు కూడా కష్టమవుతున్నాయి. క్రీడల వాయిదా వల్ల జపాన్ పై మరింత ఆర్ధిక భారం పడనుంది. స్పాన్సర్లు, ప్రచార దారులు కూడా నష్టపోనున్నారు. క్రీడల క్యాలెండర్ ఇప్పటికే కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో 2021లో క్రీడా నిర్వహించడం ఒలింపిక్ సంఘానికి పెద్ద సవాలే.  అయితే వచ్చే ఏడాది ఆగస్ట్ 6 నుంచి 15 వరకు జరిగే ప్రపంచ చాంపియ‌న్‌షిప్‌ను వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వరల్డ్ అథ్లెటిక్స్‌ ఇప్పటికే ప్రకటించింది. ఒలంపిక్ పై స్పష్టత ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది చాలా పెద్ద నిర్ణయం కానీ సరైన నిర్ణయ‌మ‌ని బ్రిటిష్ స్పింట‌ర్‌ ఆడం జెమినీ వ్యాఖ్యానించాడు.

LEAVE A REPLY