భారత్ తో సహా 64 దేశాలకు అమెరికా ఆర్ధిక సహాయం

54
US-announced-USD-2.9-million-to-India
US-announced USD 2.9 million to India

కరోనా మహమ్మారిపై పోరాటడటానికి భారత్ తో సహా 64 దేశాలకు అమెరికా ఆర్ధిక సహాయం

శుక్రవారం అమెరికా భారత దేశానికి 2.9 మిలియన్ డాలర్లతో సహా 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

ఫిభ్రవరి లో అమెరికా ప్రకటించిన 1000 మిలియన్ల డాలర్ల సహాయానికి ఇది అదనంగా ఈ సహాయాన్ని ప్రకటించింది.

కొత్తగా ప్రకటించిన ఈ సహాయం అత్యంత భాదిత దేశాలకు ఈ కరోనా మహమ్మారి ముప్పు నుండి తప్పించుకోవడనికి ఉపదయోగ పడాలి అని పేర్కొంది.

భారత దేశంలో కొత్తగా ప్రయోగశాలకు, మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమయ్యే నిఘా కేంద్రాల ఏర్పాటుకు, సాంకేతిక నిపుణులకు డాక్టర్లకు మద్దతుగా 2.9 మిలియన్ల డాలర్లు అందిస్తున్నట్లు అమెరికా తెలిపింది.

భారత దేశానికి గత 20 ఏళ్లలో 2.8 బిలియన్ డాలర్లకు పైగా అమెరికా గవెర్నమెంట్ చేసిన సహాయంలో 1.4 బిలియన్ డాలర్లకు పైగా ఆరోగ్య సహాయం కోసమే అని విదేశాంగ శాఖ తెలిపింది.

భారత్ తో సహా 64 దేశాలకు అమెరికా ఆర్ధిక సహాయం

LEAVE A REPLY