నిజమైన హీరోలు మీరే …! విజయ్ దేవరకొండ

45
Hero-Vijay-Devarakonda-Appreciates-Telangana-Police

నిజమైన హీరోలు మీరే …! విజయ్ దేవరకొండ

మేము తెరపైన కనపడే హీరోలం మాత్రమే కానీ అసలు నిజమైన హీరోలు అంటే పోలీసులే అన్నారు మన స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఆయన తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ని సందర్శించారు. మీ అందరికి థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చాను. పోలీసులు శాంతి భద్రతలను కాపాడటమే కాదు ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులలో నిత్యావసరాల సరుకులు ప్రజలకు అందిస్తూ పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు. ప్రస్తుతం నేను కోవిడ్ కంట్రోల్ రూమ్ నుండి మాట్లాడుతున్నాను. తెలుగు సినిమా పరిశ్రమ తరుపున తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.

Read also: కరోనా వైరస్ వ్యాప్తి పై ప్రజలకు, మీడియాకు సూచనలు !

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను అద్భుతంగా అమలుపరుస్తున్నారని ప్రశంసించారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరు మద్దతుగా ఉంటారని తెలిపారు.

ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ ఒక వీడియో పంపించారు అందులో పోలీసులను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ వీడియో ను ట్విట్టర్ లో డీ జీ పీ మహేందర్ రెడ్డి అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఇలాంటి సందర్భంలో ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే సందేశం ఇచ్చిన విజయ్ దేవరకొండని డీ జీ పీ మహేందర్ రెడ్డి అభినందించారు.

LEAVE A REPLY