1000 మందికి పైగా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దిన విహబ్ | WE HUB

27
దేశంలోనే తొలి సారిగా తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన విహబ్
దేశంలోనే తొలి సారిగా తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన విహబ్

2020లో పల్లె మహిళలకు ప్రోత్సాహం. దేశంలోనే తొలి సారిగా తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన వి హబ్ అద్భుత ఫలితాలను సాధిస్తుందని విహబ్ సీఈఓ రావుల దీప్తి వెల్లడించారు. 2018 మార్చి 8 న మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ వి హబ్ ను ప్రారంభించారు వీ హబ్ ద్వారా 200కు పైగా అనుకూల పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాం వెయ్యి మందికి పైగా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాం అని రావుల దీప్తి వెల్లడించారు.
we hub logo
అరవై ఒక్క అంకుర పరిశ్రమలు ఇంకుబేటర్ ఆలోచన ద్వారా ప్రారంభమయ్యాయి వీటిలో 300 మంది ఉపాధి పొందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు కోటి రూపాయల వరకు రుణ అందించేందుకు కృషి చేస్తోంది. జర్మనీ ఆస్ట్రేలియా స్విజర్లాండ్ ల కు చెందిన సంస్థలు విహబ్ శిక్షణ కార్యక్రమాలకు సహాయం అందిస్తున్నాం మహిళలు తమ ఆలోచనలను మాకు తెలియజేస్తే చాలు మేము వారి ముంగిట నిలుస్తాం ఎవరు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు అని రావుల దీప్తి తెలియజేశారు