తబ్లీగీ జమాత్ మర్కజ్ వల్ల భారీగా పెరిగిన కరోనా కేసులు …

99
tablighi jamaat
tablighi jamaat

తబ్లీగీ జమాత్ అనే దీనిని ఢిల్లీ నించి మేవాత్ వరకు మత పరమైన బోధనను అందించేందుకు 1926-27 లో మొదలు పెట్టారు. దీన్ని ప్రారంభించినారు ఐసలామిక్ స్కాలర్ మౌలానా మహమ్మద్.

1941 లో తబ్లీగీ జమాత్ మొట్ట మొదటి సమావేశం జరిగిది. 25 వేలకు పైగా మంది పాల్గొన్నారు. దీని శాఖలు భరత్, పాకిస్థాన్ మరియు బాంగ్లాదేశ్ లాలో ఏర్పాటు అయ్యాయి.కర్మ క్రమంగా తబ్లీగీ జమాత్ కార్యకలాపాలల్లో
వేగం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక శాఖలుగా అమెరికా, బ్రిటన్, మలేసియా, సింగపూర్ మరియు ఇండోనేషియా ఏర్పడ్డాయి.

ప్రతి సంవత్సరం దీని అతిపెద్ద  సమావేశం బాంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ లోని రాయ్విండ్ లో జరుగుతుంది. తబ్లీగీ జమాత్ లో పాల్గొనేందుకు వివిధ దేశాలనుండి అనేక మంది ముస్లిమ్లు పెద్ద సంఖ్యలో హాజరు అవుతుంటారు.

tablighi jamaat

ఢిల్లీ లో హజ్రత్ నిజాముద్దీన్ లో జరిగిన మతపరమైన సమ్మేళనానికి హాజరైనా తబ్లీగ్ జమాత్ మర్కజ్ ప్రతినిధుల వల్లనే కరోనా వైరస్ కేసులు 386 పెరిగాయి. భారతదేశ వ్యాప్తంగా  కరోనా కేసుల సంఖ్య 2069 చేరింది. ఇప్పటివరకు భారత్ లో కరోనా వల్ల 53 మంది మరణించారు.కరోనా కేసుల్లో మొదటి స్థానం లో మహారాష్ట్ర ఉండగా, రెండో స్థానం తమిళనాడు వుంది.

Read also: కరోనా అంటే ఏమిటి ? నివారించడం ఎలా ?

తెలంగాణాలో కూడా తబ్లీగ్ జమాత్ మర్కజ్ వెళ్ళివచ్చినవారితోనే గురువారం ఒక్క రోజే 27 కరోనా కేసులు బయట పడ్డాయి.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 153 కరోనా కేసులు నమోదు అయ్యాయి.ఇప్పటి వరకు రాష్ట్రంలో 17 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు మరణించారు.ఒక్క రోజులోనే నల్గొండ జిల్లాలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.సంగారెడ్డి జిల్లాలో కూడా 6 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 143 నమోదు అయ్యాయి. అత్యధికంగా గుంటూరు లో 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి అని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.వీరిలో ఎక్కువగా ఢిల్లీ లో తబ్లీగ్ జమాత్ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొన్నవారే  వున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

LEAVE A REPLY